జగన్ సర్కార్ కి హైకోర్టు షాక్.. ఆ జీవో కొట్టివేత..!

-

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకిచ్చింది. కరోనా కష్ట కాలంలో 50 శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలన్న ఏపీ ప్రభుత్వ జీవోలను మంగళవారం నాడు రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. మార్చి, ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ల బకాయిలను 12 శాతం వడ్డీతో సహా 2 నెలల్లోపు చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో కేంద్రంతో పాటు పలు రాష్ట్రా ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి.

 

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం 50 శాతమే జీతాలను చెల్లించేలా జీవోను జారీచేసిన చేసిన విషయం తెలిసిందే. కాగా, విశాఖపట్నంకి చెందిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు కోత విధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news