డ్రగ్స్ కు అడ్డగా మారిన ఏపీ..దేశంలోనే నంబర్ వన్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్ కు అడ్డాగా మారిపోయింది.  దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేశంలో 2021-22 లో పట్టుబడిన మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలపై ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా’ 2021-22 పేరుతో కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది.

ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే 18,267 కేజీల మాదకద్రవ్యాలు, 1000 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా రూ. 97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో 1,000 కేజీల డ్రగ్స్, మత్తు పదార్థాలు పట్టుబడినట్లు నివేదికలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news