ఏపీ మంత్రి వర్గ కూర్పు కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది. నిన్న రాత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి, సజ్జల ఇద్దరు కలిసి.. ఏపీ మంత్రి వర్గ 10 మంది పాతవారినే కొనసాగింపునకు అవకాశం ఉన్నట్లు సీఎం క్యాంపు వర్గాలు చెబుతున్నాయి. ఇక ఏపీ కేబినేట్ లో 15 మందికే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట.
సామాజిక సమీకరణలు, అనుభవం, జిల్లా అవసరమే ప్రాతి పదికల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇద్దరు గిరిజనులు, ఇద్దరు మైనారిటీలకు అవకాశం అవకాశం ఇచ్చేందుకు సీఎం జగన్ ప్లాన్ చేశారట.
అలాగే… ఈ సారి ఆరుగురు ఎస్సీలకు క్యాబినెట్‌లో చోటు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారట. దీనిపై క్లారిటీ రావాలంటే.. రేపటి వరకు ఆగాల్సిందే. కాగా… చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అభ్యర్థన మేరకు తుడా ఛైర్మన్ పదవిని సీఎం జగన్ పొడిగించారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ సారి కూడా మంత్రి లేనట్లే.