ఓపీఎస్​ అమలుకు సర్కార్ నో.. జీపీఎస్​కు ఉద్యోగులు ససేమిరా

-

ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. జీపీఎస్​ ఆమోదయోగ్యం కాదని గతంలోనే తెలిపామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. సీపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేస్తామన్నారని పేర్కొన్నారు. ఈ చర్చల్లో మంత్రులు బొత్స, బుగ్గన, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఏపీజేఏసీ అమరావతి, ఏపీ సీపీఎస్ యూఎస్ సంఘాలు, ఏపీసీపీఎస్ ఈఏ సంఘాలు భేటీకి దూరంగా ఉన్నాయి.

రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు సీఎం హామీ ఇచ్చారని మంత్రి బొత్స అన్నారు. అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందన్నారు. సీపీఎస్ రద్దుకు ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని మంత్రి తెలిపారు. సీపీఎస్ కంటే మెరుగ్గా ప్రభుత్వం జీపీఎస్ తీసుకువచ్చిందని స్పష్టం చేశారు.

“ఓపీఎస్‌ అమలు చేయలేమని ప్రభుత్వం చెప్పింది. సీపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేస్తామన్నారు. రిటైర్‌మెంట్‌ తర్వాత 33శాతం గ్యారంటీడ్‌ పింఛన్‌ ఇస్తామన్నారు. ఉద్యోగికి ప్రమాద, హెల్త్ బీమా, స్పౌజ్ పింఛన్ ఇస్తామన్నారు. ఉద్యోగికి రూ.10 వేల కనీస పింఛను ఇస్తామన్నారు. జీపీఎస్‌ వల్ల నష్టమని ప్రభుత్వానికి నివేదించాం. జీపీఎస్ ఆమోదయోగ్యం కాదని గతంలోనే చెప్పాం. సీపీఎస్ రద్దుపై మంత్రుల కమిటీ అధ్యయనం వివరాలు ఇవ్వాలని కోరాం. ప్రజాస్వామ్యయుతంగా మా డిమాండ్లు తెలుపుతున్నాం. సీపీఎస్‌ రద్దు అనేది మా జీవన్మరణ సమస్య. జగన్‌ సీఎం అయితే మా సమస్య పరిష్కారమవుతుందని ఆశించాం. చేయగలిగేవే చెప్తానని ఎన్నికలకు ముందు జగన్ అన్నారు. జీపీఎస్‌ గురించి తప్ప.. ఇతర అంశంపై మాట్లాడేది లేదని మంత్రులు అన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌లో సీపీఎస్ రద్దు చేశారు. ఇచ్చిన హామీని సీఎం జగన్‌ హామీ అమలు చేయాలి. పాత పింఛన్‌ విధానం పునరుద్ధరణ ఒక్కటే మా ఏకైక డిమాండ్‌. పింఛన్‌ అనేది భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది. ” అని ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news