సీఎం జగన్ పాలనలో రైతులు, యువత, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారు -అసెంబ్లీలో గవర్నర్

-

 

సీఎం జగన్ పాలనలో రైతులు, యువత, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారని అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు.ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ తరుణంలోనే మొదటగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభం అయింది. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ.. విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు.

Ap new governor abdul nazeer speech in assembly

సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందన్నారు. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది.. రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారని చెప్పారు. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించామని స్పష్టం చేసారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించాం. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version