భారత్ నెట్ ప్రాజెక్ట్ కోసం కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు..!

-

ఏపీలో భారత్ నెట్ ప్రాజెక్టును విస్తృతపరిచేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. భారత్ నెట్ సమర్ద వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. భారత్ నెట్ రెండో దశలో భాగంగా మల్టీ ప్రొటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ టెక్నాలజీ కోసం ఖర్చు చేసిన రూ. 650 కోట్లు ఏపీకి తిరిగి చెల్లించాలని కోరారు అధికారులు. ఏపీ ఎఫ్ఎస్ఎల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 9.7 లక్షల గృహాలరు హైస్పీడ్ బ్రాండ్ బాండ్ సేవలందిస్తున్నట్టు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం.

మొత్తం 6200 పాఠశాలలు, 1978 ఆరోగ్య కేంద్రాలు, 11254 గ్రామ పంచాయతీలు, 5800 రైతు కేంద్రాలకు, 9104 ప్రభుత్వ కేంద్రాలకు ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్నట్టు కేంద్రానికి వివరించింది ఏపీ. తక్షణం 35 లక్షల సీపీఈ బాక్సులు అందిస్తే భారత్ నెట్ సేవలను మరింత విస్తృతపరుస్తామని కేెంద్రానికి తెలిపింది ఏపీ ప్రభుత్వం. అలాగే భారత్ నెట్ ఫేజ్-3 ప్రతిపాదనలు కూడా సమర్పిస్తామని కేంద్రానికి వివరించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version