జ‌గ‌న్ మేనిఫెస్టో బీజేపీ వాళ్ల‌కు ఓ కాపీ పంప‌వా…!

-

“నేను అధికారంలోకి వ‌చ్చి.. నా పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా నేను చె ప్పేది ఒక్క‌టే.. ఈ ఏడాది కాలంలో మూడు మాసాలు క‌రోనా వ‌ల్ల వేస్ట్ అయింది. అయినా కూడా మేనిఫె స్టోలో పేర్కొన్న మేర‌కు 90 శాతం హామీల‌ను తొలి ఏడాదిలోనే పూర్తి చేశాను. ఇంకా చెప్ప‌న‌వి కూడా చేశా ను. అవ‌స‌ర‌మైతే.. ఇంటింటికీ మా పార్టీ ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పిన మేనిఫెస్టోను పంపిస్తాను. చూడం డి.. మీ అభిప్రాయం నాతో పంచుకోండి!“- ఇదీ సీఎం జ‌గ‌న్ త‌న తొలి ఏడాది పాల‌న పూర్త‌యిన సంద ‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం.

 

వాస్త‌వానికి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి వివిధ ప‌థ‌కాల రూపంలో ల‌బ్ధి చేకూరుతోంది. అదేస‌మ‌యంలో వివిధ ప‌థ‌కాలు కూడా అందుతున్నాయి. కాబ‌ట్టి.. వారికి మంచేదో.. చెడేదో.. ఎవ‌రు మాట‌లు చెప్పుకొని కాలం వెళ్ల‌దీస్తున్నారో..  ఎవ‌రు నియంత‌ల మాదిరిగా రాజ్యాంగాల‌నే మార్చేస్తున్నారో.. ఎవ‌రు అర్బ‌న్ న‌క్స‌లిజం పేరుతో మేధావుల‌ను ఇబ్బందిపెడుతున్నారో.. ఎవ‌రు అదిగో పులి అంటే.. ఇదిగో తోక అంటూ.. ప్ర‌చారం చేసుకుంటున్నారో.. ప్ర‌జ‌ల‌కు తెలియంది కాదు. కానీ, అస‌లు తెలియాల్సింది… గొర్రెతోక నాయ‌క‌త్వంతో.. అల‌మ‌టిస్తూ.. ఎదుగూ బొదుగూలేని కొన్ని రాజ‌కీయ పార్టీల‌కు!

జ‌గ‌న్ ఏడాది పాల‌నంతా అరాచ‌క‌మ‌ని, అన్నీ రివర్సే. రాజధాని రివర్స్‌. పోలవరం ప్రాజెక్టు టెండర్లు రివర్స్‌. ఎలక్షన్‌ కమిషన్‌లో రివర్స్‌ అని,  ఏపీలో ఒకరు బెయిల్‌పై బయట ఉంటే, మరొకరు లోపలకు వెళ్లకుండా బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక పాలనపై ఎక్కడ దృష్టి పెడతారన్నారని, అధికారంలోకి వస్తే మద్య నిషేధం అన్న వ్యక్తి ఇప్పుడు ఏపీ ప్రజలకు కొత్త కొత్త బ్రాండ్లు పరిచయం చేస్తూ దోచుకుంటున్నారని,  మరో ప్రత్యామ్నాయం లేకే వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని.. అంటూ.. నోరు పారేసుకుంటున్న క‌మ‌ల కూట‌మికి జ‌గ‌న్ ఏడాది పాల‌న‌లో మెరుపులు ఏమిటో తెలియాల్సిన  అవ‌స‌రం ఎంతైనా ఉంది. సో.. ప్ర‌జ‌ల‌క‌న్నా ముందు.. నీ మేనిఫెస్టోను.. వారికి పంపించు జ‌గ‌న‌న్నా.. క‌ళ్లు తెరిచి చూసుకుని.. బుద్ధి తెచ్చుకుంటారు! అని సూచిస్తున్నారు సామాన్య ప్ర‌జ‌లు!!

Read more RELATED
Recommended to you

Latest news