ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన APSRTC..!

-

అడ్వాన్స్ రిజర్వేషన్ విషయంలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ. గతంలో ఉన్న గడువుని  మరింత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో బస్సు టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ కాలాన్ని పెంచుతున్నట్టు తెలిపింది. గతంలో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే గడువు ఉండేది. ఆ గడువుని పొడిగిస్తూ ప్రస్తుతం బస్సు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ను 30 రోజుల ముందుగానే చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. కాగా ఈ అవకాశం శనివారం నుండే అమలులోకి వచ్చింది. అయితే ఏపీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అన్ లాక్ 3.0 ఆగష్టు 30తో పూర్తికావస్తుండడంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాక‌పోక‌ల విషయంలో వచ్చే వారం టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు మధ్య చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news