అనంతపురం: వైయస్ కుటుంబ సభ్యులంతా వైయస్సార్ పేరును భ్రష్టు పట్టించారని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆ ఫ్యామిలీని టీవీ చానల్స్ లో కనిపించేలా చేశారని వ్యాఖ్యానించారు. జగన్ మనసంతా అవినాష్ రెడ్డి పైనే ఉందన్నారు రామకృష్ణ. వైయస్ వివేకాని చంపింది ఎవరో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారని అన్నారు. పోలీసులు, సిబిఐ సరిగా పనిచేసుంటే ఈ కేసుకు నాలుగేళ్లు పట్టేది కాదన్నారు.
రాష్ట్రంలో ఎస్సీ ఎమ్మెల్యేలు పదవులు కాదు ఆత్మగౌరవం అడగాలన్నారు. దేశంలో బిజెపి ప్రమాదకర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు రామకృష్ణ. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక నేరాలు చేసిన వారిని విమానాల్లో విదేశాలకు పంపుతున్నారని అన్నారు. కర్నాటక బీజేపీ నాయకుల్లో 40 శాతం మంది అవినీతిపరులేనన్నారు. అవినీతి పరులపైన సీబీఐ లను పంపకుండా ప్రతిపక్షాల పై దాడులకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.