నగరిలో రోజా గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. టీడీపీ లక్ష్యం 160 స్థానాలు అని… ఓ మహిళా నాయకురాలు ఏదేదో కామెంట్లు చేస్తోందని ఆమెపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు తల కిందుల తపస్సు చేసినా 160 సీట్లు రావంటోందని.. వచ్చేవి 160 సీట్లా.. ఓట్లా అంటూ కామెంట్లు చేస్తోందన్నారు.
రోజాకు ధైర్యముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్దపడాలి.. నగరిలో టీడీపీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో మేం పోటీ చేయమని వెల్లడించారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాకే మహిళలకు ఆస్తిలో హక్కు దక్కిందని.. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా చంద్రబాబు కృషి చేశారని తెలిపారు. ప్రజలు మోసపోయి.. జగనుకు ఓటేసి అధికారం కట్టబెట్టారని.. అధికారం కోసం ఏ గడ్డైనా తినే వ్యక్తి జగన్ అని మండిపడ్డారు.
కులం, మతం, ప్రాంతం వంటి అంశాలను పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు అని.. సింపతీ కోసం కోడి కత్తి డ్రామా ఆడారు.. అయినా దాని వల్ల సింపతీ రాలేదని అగ్రహించారు. మరింత సింపతీ కోసం తన బాబాయిని చంపేసినా పట్టించుకోని వ్యక్తి జగన్ అని.. 151 సీట్లు వచ్చినా.. అతి తక్కువ కాలంలో విపరీతమైన వ్యతిరేకతను పెంచుకున్నాడని చురకలు అంటించారు.