హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు జరుపుకుంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి నేడు తెలంగాణ హైకోర్టులో మరొ అఫీడవిట్ దాఖలు చేశారు. సునీతా ఇంప్లీడ్ పిటిషన్ వెనక సిబిఐ హస్తం ఉందని ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు అవినాష్. వివేకా అల్లుడు రాజశేఖర్, వివేకా రెండవ భార్య షమీమ్ ల పాత్రపై సిబిఐ దర్యాప్తు చేయటం లేదన్నారు. వివేకది హార్టేటాక్ అని నేను ఎక్కడ చెప్పలేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు అవినాష్ రెడ్డి.

శశికళ అనే మహిలతో నేను మాట్లాడలేదని.. శషికళ ఇదే అంశంన్ని సిబిఐ కి చెప్పిందన్నారు. సిబిఐ దాఖలు చేసిన రెండు చార్జిషీట్ లలో సిట్ దర్యాప్తు నివేదికను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. 10 న జరిగిన విచారణ లో నా గుగుల్ టేక్ఔట్ డేటా ను విచారణలో సిబిఐ అడిగిందని.. పారదర్శకంగా విచారణ జరిపితే ఇవ్వడానికి నేను సిద్ధం అని స్పష్టం చేశారు అవినాష్ రెడ్డి.