జగన్ కోసం ప్రైవేట్ సైన్యం పనిచేస్తుంది: బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి

-

జగన్ కోసం ప్రైవేట్ సైన్యం పనిచేస్తుందన్నారు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ భేటీ పై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

 

‘బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడి కొందరు ఉత్పత్తుల కోసం తిరుగుతున్నారు. దొంగను కలిసిన వాడిని ఏమంటారు? ఎంతమంది కలిసి వచ్చిన జగన్ ను ఏమి చేయలేరు. జగనన్న కోసం ఒక సైన్యమే పనిచేస్తుంది. జగన్ మంచి చేస్తున్నారు. సమాజంలో మార్పు తెస్తున్నారు. అలాంటి సీఎంకు రక్షణ కవచంగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని వ్యాఖ్యానించారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.

 

 

ఏపీలో జగన్ ను ఓడించే సత్తా ఎవరికీ లేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news