వేలంలో రూ. 2కోట్ల 20లక్షలు పలికిన చేప..!

-

చేపల బరువు, వాటి ధర ఎంతుంటుందో మనకు బాగానే తెలుసు.. చాలామందికి చేపలంటే ఇష్టం ఉంటుంది. నిజానికి ఇవి మటన్‌ కంటే తక్కువే.. బాగా బరువున్న చేప ఎంత ఉంటుంది అంటే మీరు ఎంత చెప్తారు.. 20/50/100..ఒక్క చేప క్వింటా బరువు ఉంటుందా అని మనకు డౌట్‌ కూడా రావొచ్చు. అలాగే బాగా కాస్ట్లీ చేప ఎంత ఉండొచ్చు.. మహా అంటే ఒక లక్ష వేసుకుందాం..కానీ ఈ చేప కాస్ట్‌ అక్షరాల రెండు కోట్లు..ఏంటి నడం లేమ్మదా..?
సముద్రంలో దొరికే చేపల్లో బాగా టేస్ట్‌గా ఉండేది..ఎక్కువ బరువైన చేప టూనా ఫిష్. అయితే ఇందు బ్లూ ఫిలో కూడాన్ రకం టూనా చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా డిమాండ్ దుకే జపాఉంది. అంన్‌లో ఓ చేప రెండు కోట్ల రూపాయలు పలికింది. ఉత్తర అమెరికాలోని ఒమా సముద్రంలో చేపల వేటగాళ్లు వేసిన వలలో భారీ బ్లూఫిన్ ఫిష్డిం పది. అంతే వేటగాళ్లు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఎందుకంటే పడిన చేప బరువు 212కిలోలు అంటే రెండు క్వింటాళ్లకు పైనే..
భారీ సైజులో ఉండే ఈ టేస్టీ ఫిష్ బ్లూ ఫిన్ టూనా ఫిష్ అంటే నాన్‌ వెజ్ లవర్స్‌కి బాగా ఇష్టం.. అందుకే ఇంత పెద్ద సైజులో ఉండే ఈ చేపను దక్కించుకునేందుకు బడా వ్యాపారులు, స్టార్ హోటల్‌ యజమానులు పోటీ పడుతుంటారు. ఉత్తర అమెరికాలో దొరికిన 212కిలోల బ్లూఫిన్ టూనా చేపను న్యూ ఇయర్ సందర్భంగా జపాన్‌లో వేలం వేశారు. టోక్యో సిటీలోని ఫిష్‌ మార్కెట్‌లో వేలం నిర్వహిస్తే ఈ రెండు క్వింటాళ్లకుపైగా బరువున్న చేప 2.2కోట్ల రూపాయలు పలికింది.
వందల కిలోల బరువైన ఈ బ్లూ ఫిన్ టూనా ఫిష్‌ను జపాన్‌లో సూషీ రెస్టారెంట్లు నడిపే ఒనోడెరా గ్రూప్ 2కోట్ల 20లక్షల రూపాయలకు చేజిక్కించుకుంది. భారీ మొత్తంలో వేలంలో దక్కించుకున్న చేపను వెరైటీ డిష్‌లు కస్టమర్లకు అందించడమే కాకుండా..వేర్వేరు దేశాలకు తరలిస్తున్నారు. ఉత్తర అమెరికా సముద్రంలో దొరికే బ్లూ ఫిన్ టూనా చేపలకు బ్లాక్ డైమండ్స్ అనే పేరు కూడా ఉంది. టూనా చేపలు సిల్వర్ కలర్‌లో ఉంటే ఈ బ్లూఫిన్ టూనా చేపలు మాత్రం కాస్త నలుపు రంగులో ఉండి బరువు ఎక్కువ ఉంటాయి.. మనకు చేపలంటే..బొమ్మిడాయలు, కొరమీన్‌, శిలావతి లాంటివే తెలుసు.. ప్రపంచ వ్యాప్తంగా చేపల్లో బోలెడు రకాలు ఉన్నాయి.. అందులో కొన్నిచేపలు అయితే మహా డెంజరెస్‌..అది సరిగ్గా వండటం రాకపోతే..విషంగా మారి ప్రాణాలే పోతాయి..ఇంకా ఈ చేప చూశారుగా… రెండు కోట్లు పలికింది..! ఆశ్యర్యంగా ఉంది కదూ..!

Read more RELATED
Recommended to you

Latest news