ఏపీ రైతులకు బిగ్ షాక్.. ఆ రైతులకు మొండి చెయ్యి !

-

ఏపీ రైతులకు బిగ్ షాక్. పంట రుణాలపై సున్నా వడ్డీ అమలు చేస్తున్నామని జగన్ ప్రభుత్వం గొప్పగా చెబుతున్న 80 శాతం మందికి ఆ ఫలాలు దక్కడం లేదు. రాష్ట్రంలో ఏటా భూమిపై పంట రుణాలు తీసుకునే రైతులు 52 లక్షల పైగా ఉంటున్న, వారిలో 10 లక్షల మంది కూడా లబ్ధి పొందలేకపోతున్నారు.

లోపం ఎక్కడ? ఎందుకు అధిక శాతం రైతులు అర్హత సాధించలేకపోతున్నారనే విషయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు ఉన్న పంట రుణాలపై గతంలో ‘పావలా వడ్డీ’ పథకమైన వర్తించేది. వైసిపి ప్రభుత్వం ఆ పథకానికి మంగళం పాడింది.

పైగా సున్నా వడ్డీ కింద ఏడాదికి రూ. 3,000 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుందని 2019 జూలైలో సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. ఆ మేరకు నిధులు కేటాయించడం లేదు. గణాంక శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 85.14 లక్షలు. వారిలో 2.5 ఎకరాల్లోపు భూమి ఉన్నవారు 69% ఐదు ఎకరాలల్లోపు రైతులు 75.5 లక్షలు. సున్నా వడ్డీ అర్హుల సంఖ్య 2020-21 సంవత్సరంలో 10 లక్షలు కూడా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news