ఏపీ రైతులకు జగన్ సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడం, సీజన్ కు సరిపోయేలా సాగునీటి సరఫరాతో ఎక్కువ మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారని, ఈ ఆలోచన నుంచి బయటకు రావాలని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగుకు కూడా రైతులు ఆసక్తి చూపాలని విజ్ఞప్తి చేశారు. వరిని అధికంగా సాగు చేయడం వల్ల ఆ పంటను కొనుగోలు చేయడం ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారుతోందని అన్నారు.
సీజన్‌కు తగ్గట్టుగా సాగునీరు సరఫరా చేస్తుండడంతో రైతులందరూ వరిని సాగుచేస్తున్నారని, కానీ ఈ పంటంతా కొనేందుకు ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రి కాకాణి అన్నారు. కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, ఇతర పంటలను సాగు చేయాలని మంత్రి కాకాణి రైతులకు సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వరి, మొక్కజొన్న వంగడాలను దేశంలోని 75 శాతం మంది రైతులు వినియోగిస్తున్నారన్న మంత్రి.. దీనికి కారకులైన శాస్త్రవేత్తలను అభినందించారు మంత్రి కాకాణి.