BREAKING: రేపటి నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

-

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల అసోసియేషన్ షాక్ ఇచ్చింది. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని తీర్మానించాయి. బకాయిల విడుదల విషయంలో ఏపీ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ సేవలు నిలిపి వేస్తున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. దీంతో మే 19వ తేదీ నుండి అన్నీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల నెట్వర్క్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

అసోసియేషన్ లెక్కల ప్రకారం ప్రభుత్వ బకాయిలు 2 వేల కోట్లకు పైమాటే. ఇలాంటి సందర్భంలో ఆరోగ్యశ్రీ సేవలు అందించడం తమ వల్ల కాదని అసోసియేషన్ తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే రేపటి నుండి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితి ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news