సోనియా కాళ్ల మీద జగన్ పడ్డారంట… బాబును ఇరికించిన బుద్దా!

-

సోనియా కాళ్ల మీద జగన్ పడ్డారంట… బాబును ఇరికించిన బుద్దా!అవినీతి కేసుల నుంచి, సీబీఐ ఎంక్వైరీలనుంచి తప్పించుకోవడానికి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నారు.. పదుల సంఖ్యలో కేసుల నుంచి తప్పించుకోవడానికి పదవిని అడ్డుపెట్టుకుని కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నారు.. పార్టీలకు అతీతంగా కేంద్రంలోని పెద్దలతో, అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తారు అనే పేర్లు సంపాదించుకున్నారు అని చెప్పే చంద్రబాబును ఇరికించే పనికి పూనుకున్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న!

అవినీతి నుంచి బయటపడటానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్ ఎవరికాళ్ల మీదైనా పడతారు.. అందులో భాగంగా బెయిల్ కోసం సోనియా కాళ్ల మీద పడ్డారు.. నేడు మోడీ కాళ్ల మీద పడ్డారు అని చెప్పుకొస్తున్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. వాస్తవాలు మరిచి.. తమ కంటిలో దూళం సంగతి మరిచిన వెంకన్న… ఇలా ఎన్నడూ లేనిది, ఇప్పటివరకూ రాజకీయ ప్రత్యర్ధులు సైతం అనని మాట అన్నారు!

అసలు జగన్ కు సోనియా గాంధీ కాళ్లు పట్టుకునే ఉద్దేశ్యమే ఉంటే.. అసలు జైలుకే వెళ్లి ఉండేవారు కాదనేది జగమెరిగిన సత్యంగా అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సామాన్య ప్రజానికంలోనూ చర్చలు నడుస్తుంటాయి. అలాంటి జగన్… బెయిల్ కోసం సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని వెంకన్న మాట్లాడటం.. విడ్డూరమే కాకుండా.. బాబు గతాన్ని మరోసారి గుర్తు చేసుకునేలా వ్యాఖ్యానిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు!

పరిపాలన పరంగా జగన్ పై విమర్శలు చేయడానికి ఇంకేమీ లేవో ఏమో కానీ… సోనియా గాంధీని ఎదురించడం వల్లే జగన్ జైలుకు వెళ్లారు అనే టాపిక్స్ నడుమ… వెంకన్న ఇలా కొత్త టాపిక్ ఎత్తి.. నవ్వుల పాలయ్యారని, పరోక్షంగా మరోసారి చంద్రబాబుని నవ్వుల పాలు చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news