ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

-

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. దర్శి సమీపంలో సాగర్‌ కాల్వలోకి పెళ్లి బృందం బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35 నుంచి 40 మంది ఉన్నట్లు సమాచారం.

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మరణించిన వారిని పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్‌ అజీజ్‌(65), అబ్దుల్‌ హాని(60),షేక్‌ రమీజ్‌ (48), ముల్లా నూర్జహాన్‌ (58), ముల్లా జానీబేగం(65), షేక్‌ షబీనా(35), షేక్‌ హీనా(6)గా గుర్తించారు. వివాహ రిసెప్షన్‌ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news