టీడీపీ లో కులం కుంపటి ? వారే కావాలా .. మేము వద్దా ?

-

కుల లెక్కలు వేసి రాజకీయ లెక్కల్లో పై చేయి సాధించడంలో టిడిపి అధినేత చంద్రబాబును మించిన వారు మరొకరు ఉండరు. ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తుగడలు వేస్తూ , అన్ని కులాల్లో పట్టు సాధించేందుకు గట్టిగానే కష్ట పడుతూ ఉంటారు. అయితే బాబు లెక్కలు ఒక్కో సందర్భంలో బెడిసి కొడుతూ ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇదే విధమైన కుల కుంపట్లలో వేలు పెట్టి బాబు చేతులు కాల్చుకుంటూ ఉంటారు. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇవ్వడం,  ఆ తర్వాత హామీ మరిచిపోవడం, కాపులంతా ఏకమై టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టడం వంటి వ్యవహారాలు నడిచాయి.
దీంతో టిడిపి పై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని భయపడిన ఆయన , ఆ సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు వారికి ఎన్నో తాయిలాలు ప్రకటిస్తూ , వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం ఇలా ఎన్నో వారాలు ఇస్తూ ఆదుకునేందుకు ప్రయత్నించడం వంటి పరిణామాలతో మొత్తం బీసీ సామాజిక వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చాయి. ఫలితంగా 2019 ఎన్నికల్లో బీసీ సామాజికవర్గం వైసీపీకి అండగా నిలబడ్డారు. మొదటిసారిగా టిడిపి ఘోర పరాజయం పాలైంది.
ఇదంతా ఇలా ఉంటే, ఇప్పుడు బాబు పార్టీలోని ఒక సామాజిక వర్గం ను ప్రసన్నం చేసుకునేందుకు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు.వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహిస్తూ ఉండడం తో టిడిపిలో మిగతా సామాజిక వర్గాలకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండడంతో టిడిపిపై ఎక్కడలేని ఆగ్రహం కలిగిస్తోంది.మొదటి నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెలమలకు చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఉండడం తో,  అదే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న తూర్పు కాపులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది.
తనను పెద్దగా పట్టించుకోకుండా వెలమ సామాజిక వర్గానికి బాబు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని, వారంతా బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి గతంలో కింజరపు ఎర్రన్నాయుడుకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఇక ఇప్పుడు ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉండడం తో పాటు, అసెంబ్లీలో పార్టీ తరఫున ఉప నాయకుడుగా బాబు అవకాశం ఇచ్చారు.
ఇక పార్టీ తరఫున నియమించే కమిటీల్లోనూ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు కి అదే విధమైన ప్రాధాన్యత పార్టీలో దక్కుతూ వస్తోంది. ఇక విశాఖ జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు కి బాబు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కీలక బాధ్యతలను ఇస్తూ వస్తున్నారు. అలాగే అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవిని కట్టబెట్టారు. అయితే ఈ పరిణామాలన్నీ టిడిపిలో ఉంటున్న ఉత్తరాంధ్ర కు చెందిన కాపు, తూర్పు సామాజిక వర్గానికి తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది.
తమను ఏమాత్రం పట్టించుకోకుండా,  తమ కంటే తక్కువ సంఖ్యలో ఉన్న వెలమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వారు మండిపడుతున్నారు. విశాఖ , శ్రీకాకుళం,  విజయనగరం జిల్లాల్లో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్న తూర్పు కాపు, సామాజిక వర్గాలను ఏమాత్రం పట్టించుకోకుండా వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని , ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో 36 లక్షల మంది వరకు తూర్పు కాపులు ఉన్నారని, ఉత్తరాంధ్రలోని 90% పైగా ఈ సామాజిక వర్గం వారు ఉన్నా, ఎవరికీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని, ఇలా అయితే ఎలా అంటూ గట్టిగానే గొంతు ఎత్తుతూ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండడంతో బాబు సైతం ఆలోచనలో పడ్డారట.
– Surya

Read more RELATED
Recommended to you

Latest news