ప్రభుత్వానికి ధమ్ముంది… చంద్రబాబుపై సీబీఐ ఎంక్వైరీ కన్ ఫాం!

-

చంద్రబాబు పాలనలో అవినీతి విచ్చలవిడిగా జరీగిందని వైకాపా నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై స్పందించిన చంద్రబబు & కో లు.. ధమ్ముంటే విచారణ జరిపించండి అని కౌంటర్స్ వేసేవారు. ఈ విషయాలపై తాజాగా పేర్ని నాని స్పందించారు. కేబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయాలను ప్రకటించే నేపథ్యంలో.. గత ప్రభుత్వం చేసిన పనులపై సీబీఐ ఎంక్వరీ కి కేబినెట్ డిమాండ్ చేసిందని తెలిపారు పేర్ని నాని. నాడు బాబు హయాంలో పెట్టిన పథకాలు, ఇచ్చిన కానుకలు, చేసిన పనులలో ఏ కార్యక్రమంలో ఎంత అవినీతి జరిగిందనే విషయాలు వెళ్లడించారు.

చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా లలో సుమరు రూ. 150కోట్ల వరకూ అవినీతి జరిగిందన్న విషయం మంత్రుల ప్రాథమిక విచారణలో తేలిందని మొదలుపెట్టిన నాని… ఫైబర్ నెట్ అనే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకు సంబందించి.. ఆ పనులు కాంట్రాక్ట్ ఇవ్వడం దగ్గరనుంచి, సెటప్ బాక్సుల సప్లై వరకూ అన్ని విషయాల్లోనూ అవినీతి జరిగిందన్న విషయం మంత్రివర్గ ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూడా సుమారు రూ. 200కోట్ల వరకూ అవినీతి జరిగిందని తెలిపారు. దీంతో ఈ విషయాలపై సీబీఐ ఎంక్వరీకి వేయాలని కేబినెట్ సబ్ కమిటీ తీర్మానం చేసిందని నాని తెలిపారు.

వీటిని కక్ష సాధింపు చర్యలుగా భావించవద్దని… ఈ ప్రభుత్వానికి ధమ్ముంటే, ధైర్యం ఉంటే విచారణ చేసుకోండన్నందుకే సీబీఐ ఎంక్వరీ వేయడం జరిగిందని… ఈ ప్రభుత్వానికి ధమ్ముందని పేర్ని నాని ప్రకటించారు! ఇది ఆరంభం మాత్రమేనని.. ఇలా సీరియల్ గా గత ప్రభుత్వంలో అవినీతి జరిగిన అన్ని విషయాలపైనా విచారణ ఉంటుందని స్పష్టం చేశారు!

Read more RELATED
Recommended to you

Latest news