వైఎస్ వివేకా హత్య కేసుపై కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగోసారి ప్రశ్నించింది. నాలుగు గంటలపాటు అవినాష్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. వివేకాది గుండెపోటుగా ప్రచారం చేయడంలో అవినాష్, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిల పాత్ర ఉందని సీబీఐ అనుమానిస్తున్న నేపథ్యంలో తాజా విచారణ ప్రాధాన్యం సంతరించుకొంది.
హత్యకు కొన్ని గంటల ముందు కీలక నిందితుడు సునీల్‌యాదవ్ 15 నిమిషాలపాటు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేకవుట్ ద్వారా సమాచారం సేకరించిన విషయంలోనూ ప్రశ్నించినట్లు సమాచారం. ఆయన కాల్‌డేటా గురించీ ఆరా తీసినట్లు తెలిసింది.
‘వివేకా హత్య గురించి బయటి ప్రపంచానికి ఉదయం 6 గంటలకు తెలిస్తే.. అంతకుముందే మీకు తెలిసిందనే ఆరోపణలకు మీరేం సమాధానం చెబుతారు..? హత్యాస్థలిలో రక్తపు మరకల్ని తుడిచేయడం.. మృతదేహానికి కట్లు కట్టి ఆసుపత్రికి తరలించడం.. గుండెపోటుగా చిత్రీకరించడంలో మీ పాత్ర ఉందనే ఆరోపణలపై మీ స్పందనేంటి..?’’ అని క అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
కేసు దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను మార్చాలంటూ సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖ గురించి ఆరాతీసినట్లు సమాచారం. ఎందుకు ఫిర్యాదు చేశారో చెప్పగలరా.. అంటూ అడిగినట్లు తెలిసింది.