మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది. మంగళవారం వివేక పీఏ కృష్ణారెడ్డిని విచారించిన దర్యాప్తు సంస్థ.. బుధవారం ఆయన వంట మనిషి శ్రీలక్ష్మి కుమారుడిని విచారించింది. వివేక హత్య జరిగిన స్థలంలో లభించిన లేఖ గురించి సిబిఐ విచారణ సాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కోటీలోని సిబిఐ కార్యాలయంలో వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి, వంటమనిషి శ్రీ లక్ష్మీ కొడుకు ప్రకాష్ ని విచారణ చేపట్టింది.
వీరిద్దరిని ఒకేసారి ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు. లేఖను దాచిపెట్టడానికి సంబంధించిన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ లేఖను కృష్ణారెడ్డి ద్వారా ప్రకాష్ దాచి పెట్టాడని అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లేఖ దాచిపెట్టడంపై వీరిద్దరి నుండి సిబిఐ సమాచారం రాబట్టే దిశగా ప్రయత్నిస్తుంది.