వేలి ముద్రల పరీక్షకు వివేకా లేఖ.. అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్‌

-

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితులను పక్కాగా గుర్తించేందుకు గాను కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా చనిపోయే ముందు రాసిన లేఖలో నిగూఢ వేలి ముద్రలనూ గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. వివేకా రాసిన లేఖలో ఆయన చేతిరాతతోపాటు కంటికి కనిపించని, సాధారణ పరీక్షల్లో బయటపడని వేలి ముద్రలను గుర్తించేందుకు నిన్‌హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.

అయితే ఈ పరీక్ష నిర్వహిస్తే కాగితంపై ఉన్న ఇంకు చెరిగిపోయే అవకాశం ఉన్నందున ముందస్తు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఇటీవల సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.లేఖపై వివేకావి కాకుండా మరెవరివైనా వేలిముద్రలు ఉన్నాయేమో గుర్తించేందుకు నిన్‌హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించి తేల్చాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను అప్పట్లోనే కోరింది. అయితే నిన్‌హైడ్రిన్‌ పరీక్ష సాంకేతికమైన టెక్నిక్‌ అని, దీని ద్వారా వేలి ముద్రలను గుర్తించడానికి ప్రయత్నిస్తే కాగితంపై ఉన్న చేతిరాతపై ప్రభావం పడుతుందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ లేఖ ద్వారా సీబీఐకి తెలిపింది. తదనంతర దర్యాప్తులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వివేకాతో లేఖను బలవంతంగా రాయించినట్లు సీబీఐకి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news