టీడీపీలో అంబ‌రాన్నంటిన సంబ‌రాలు.. నెవ్వ‌ర్ బిఫోర్‌..!

-

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త జోష్ క‌నిపించింది. నిజానికి ఈ రోజు (శ‌ని వారం) ఉద‌యం ఏడు నుంచి ప‌ది గంట‌ల మ‌ధ్య టీడీపీ నేత‌ల ఫోన్లు మార్మోగాయి. ఒక‌రికొక‌రు కొత్త కొత్త‌గా చె ప్పుకొని మ‌రీ సంబ‌ర‌ప‌డ్డారు. కొంద‌రైతే.. అత్యంత ర‌హ‌స్యంగా కేకులు కూడా క‌ట్ చేసుకుని.. ఫ్రెండ్స్‌కు పా ర్టీలు ఎరేంజ్ చేశార‌ని త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి దీనికి రీజ‌నేంటి? మ‌హానాడు ఎలాగూ నిర్వ ‌హించే అవ‌కాశం లేదు. దీనిపై కొంద‌రు ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటుండ‌గా.. మ‌రికొందరు మాత్రం మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెబుతున్నారు.

అయితే, టీడీపీలో ఆ చివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌రకు కూడా ఒక్క‌సారిగా తెర‌మీదికి వ‌చ్చిన ఈ జోరు వెనుక ఏం జ‌రిగింది? అనేదే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదే విష‌యం.. అత్యంత కీల‌క నేత‌లతో సంప్ర‌దించ గా .. అస‌లు స‌మాచారం వెల్ల‌డించారు. అదే.. ఏపీలో రెండు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు పిలుపు మేర‌కు అంత‌ర్గ‌తంగా ఆయా విష‌యంపై చ‌ర్చించామ‌ని తేల్చేవా రు. ఈ కీల‌క ప‌రిణామాల్లో ఒక‌టి.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న కీల‌క‌మైన మూడు నిర్ణ‌యాల‌ను హైకోర్టు తోసిపుచ్చ ‌డం.., తెలిసిందే., అంతేకాదు, ప్ర‌భుత్వంపై సీరియ‌స్ కామెంట్లు కూడా చేసింది.

ఈ ప‌రిణామాలను టీడీపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటూ.. జ‌గ‌న్ కు పాల‌న చేత‌కాద‌నే ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మూడు తీర్పుల్లో ఒక‌టి డాక్డ‌ర్ సుధాక‌ర్ కేసును సీబీఐకి అప్ప‌గించ‌డం, రెండు ఐపీఎస్ ఏబీవీని తిరిగి విధుల్లోకి తీసుకోవ‌డం, మూడు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు రంగులు మార్చ ‌డం. ఈ మూడు విష‌యాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంద‌ని, కానీ, హైకోర్టు మాత్రం ఈమూడు అంశాల‌ను కొట్టేసింద‌ని టీడీపీ సంబ‌రాలు చేసుకుంటోంద‌ట‌! అంటే .. జ‌గ‌న్‌కు పాల‌న చేత‌కాదు.. అని తాము చేసే విమ‌ర్శ‌లు ఇప్పుడు నిజ‌మ‌య్యాయ‌ని పార్టీ నేత‌లు పండ‌గ చేసుకుంటున్నారు. మ‌రి టీడీపీ నేత‌ల ఈ పైశాచిక ఆనందం ఏంటో న‌ని వైసీపీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నాయి. ఏదేమైనా.. బాబు శైలిపై కొంద‌రు విశ్లేష‌కులు సైతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news