టైం బ్యాడ్ గా ఉన్నప్పుడు అంతేనండి… ఏది పట్టుకున్నా, మరేది ఎత్తుకున్నా అంతా మట్టైపోతుంటుంది. టైం బాగున్నప్పుడు మాత్రం మట్టిపట్టుకున్నా మేలిమి బంగారమైపోతుంటుంది.. ప్రస్తుతం టీడీపీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్న మాటలిలా ఉన్నాయంట. బాబు ఏది పట్టుకున్నా అన్నీ బౌన్స్ బ్యాక్ అయిపోతున్నాయి అనేది ఇప్పుడు తమ్ముళ్ల బాదగా ఉంది! తాజాగా జగన్ తీసుకున్న చర్యలతో బాబుకు కాస్తైనా రాజకీయంగా ప్లస్ అవుతుందని, కేడర్ కి కాస్తైనా ఉత్సాహం వస్తుందని తమ్ముళ్లలో కొంతమంది భావించారంట… కానీ ఆఖరికి అదికూడా కలిసిరాలేదని ఫీలవుతున్నారు! ఇంతకూ ఆ విషయం ఏమిటంటే…
టీడీపీ నేతలపై జగన్ సర్కార్ పెడుతున్న కేసుల గురించి! నేరం చేసి జైలుకి వెళ్లినా, రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా కటకటాలపాలైనా.. రాజకీయ నాయకులకు ప్రజల్లో కాస్త ప్లస్ అవుతుందనే చరిత్ర చెబుతుంది! జైలుకి వెళ్లిన నేతలకు ప్రజల్లో కాస్త సానుభూతి ఒక శాతమైనా ఎక్కువగా ఉంటుందని అంటుంటారు.
ఈ క్రమంలో గతంలో జగన్ పై కేసులు పెట్టినప్పుడు… దాన్ని జగన్ చేసిన నేరానికి ఫలితంగా చూసినవారికంటే.. రాజకీయ కక్షసాధింపులుగా పరిగణించినవారే ఎక్కువ! అది జగన్ కు చాలా ప్లస్ అయ్యిందనేది విశ్లేషకుల మాట! ఈ క్రమంలో జగన్ సీఎం అయిన అనంతరం… సక్సెస్ ఫుల్ తొలి ఏడాది కానుకో ఏమో కానీ… టీడీపీ నేతలు వరుసపెట్టి జైళ్లకు వెళ్తున్నారు. ఆఖరికి ఇది కూడా రాజకీయంగా బాబుకు కలిసిరావడం లేదు!
ఈఎస్ఐ అవినీతి కేసులో అచ్చెన్నాయుడు అరెస్టయిన సమయంలో… బాబు బీసీ కార్డు బయటకు తీశారు.. అయినా కలిసిరాలేదు! పైగా అచ్చెన్నాయుడు ఆరోగ్యం సహకరించక హాస్పటల్ లో ఉన్నారు.. అయినా కూడా అది పత్రికల్లో ఒక చిన్న వార్త అవుతుందే తప్ప.. టీడీపీకి సానుభూతి పవనాలు ఏమీ వీయడం లేదు!
అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు అయ్యారు.. అయినా సొంతపార్టీ నేతలే స్పందించలేదు కాబట్టి.. ఇంక జనాలనుంచి ఏదో ఒరుగుతుందని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది! ఇదే క్రమంలో అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసులు నమోదయ్యాయి. అయినా కూడా కేడర్ నుంచి కూడా స్పందన రాలేదు! ప్రస్తుతం బాబును మరీ వేదనకు గురిచేస్తున్న విషయం ఇదే అంటున్నారు విశ్లేషకులు!
సాదారణంగా ప్రతిపక్షంలో ఉన్న నేతలపై కేసులు పెడుతుంటే… అరెస్టులు జరుగుతుంటే… అధికారపార్టీ ఎంతో కొంత విమర్శలు రావడం సహజం. అది ప్రతిపక్షంలో ఉన్నవారికి కొద్దో గొప్పో ప్లస్ అవుతుంది… కానీ ఈ విషయంలో టీడీపీకి అది కూడా కలిసి రావడం లేదు. అంటే… గతంలో బాబు పాలన ఆరేంజ్ లో జనాల్లో పాతుకుపోయిందని అర్థం చేసుకోవాలా.. లేక, తప్పు చేస్తే శిక్ష తప్పదు.. దానికి పెద్దా చిన్నా తారతమ్యాలు ఉండవని ఇప్పటికైనా నిరూపణ అవుతుందని జనాలు అర్ధం చేసుకున్నారని అనుకోవాలా? బాబుకు ఏమాత్రం సమాధానాలు దొరకని ప్రశ్నలుగా ఇవి మిగిలిపోబోతున్నాయా లేదా అనేది కాలమే చెప్పాలి!!