వైసీపీ ఆరిపోయే దీపం…..ఎక్సైపైరీ డేట్ దగ్గర పడిందని..నాలుగేళ్లలో ఒక్క పని చేశారా…మీ జీవితాల్లో వెసులుబాటు, వెలుగు వచ్చిందా…అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. గిద్దలూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నెల్లూరులో సెల్ఫీ ఛాలెంజ్ చేసినా వైసీపీ సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు…గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అహంకారి అని నిప్పులు చెరిగారు. వేధించి మనుషులను చంపే రకం అని మండిపడ్డారు.
షెడ్యూల్ కులాలన్ని ఊచకోత కోసిన వ్యక్తి జగన్ అని… వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపి శవాన్ని ఇంటికి పంపితే… ఎమ్మెల్సీకి ఊరేగింపు చేశారని నిప్పులు చెరిగారు. ఒక్క ఓటు జగన్ కి వేసినా మనకి మనమే అన్యాయం చేసుకున్నట్టేనని.. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిమంట కాసుకుంటున్నాడని ఆగ్రహించారు. సొంత బాబాయిని చంపిన వ్యక్తి… నిన్ను నన్ను కాపాడతాడా…అని నిలదీశారు. పుట్టిన రోజు అందరూ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో చేసుకుంటారు.. ప్రజల మధ్య పుట్టిన రోజు చేసుకోవాలని వెనుక బడిన ప్రాంతానికి వచ్చానన్నారు. నా జీవితంలో గుర్తుండే విధంగా రేపు నేను ఒక కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తా…ప్రజల కోసం నా జీవితం అంకితం చేస్తానని ప్రకటించారు చంద్రబాబు.