నేతలకు అలిగే ఛాన్స్ లేకుండా చేసిన చంద్రబాబు!

-

సాధారణంగా పార్టీలో పదవుల పంపకాలు అంత ఆషామాషీ వ్యవహారం కాదు! దానికి పెద్ద చిట్టా తయారు చేయాలి.. అనంతరం దాన్ని ఫిల్టర్ చేయాలి.. మళ్లీ ఫైనల్ కాపీ రెడీ చేయాలి.. ఈ లోపు అలిగిన వారిని బుజ్జగించాలి.. అవసరమైతే ఒత్తిడి మరీ ఎక్కువైతే కరెక్షన్స్ చేయాలి! అబ్బో పెద్ద తంతే ఉంటుంది! అయితే ఆ సమస్య చంద్రబాబు లేకుండానే టీడీపీ కమిటీలను చంద్రబాబు ఏర్పాటుచేయగలిగారు!

అవును… తాజాగా టీడీపీ కమిటీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని నియమించగా.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణనే కొనసాగిస్తున్నారు. అక్కడికి ఆరోవేలు బాధ్యతలు పూర్తికాగా.. అనంతరం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని నియమించారు బాబు!

ఇక తర్వాత 27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేయగా, 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు. ఇక జాతీయ ప్రధాన కార్యకదర్శులుగా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌ నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌ రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌ రావు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును నియమించారు.

ఇక పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్‌ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్ ‌కుమార్ ‌గౌడ్‌ను నియమించారు.

దీంతో ఆల్ మోస్ట్ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న లీడర్లందరికీ (బాలయ్యతో కలిపి) ఒక్కో పదవిని అప్పగించేశారు చంద్రబాబు! ఫలితంగా ఇకపై తమకు పదవులు రాలేదు అని అలిగేవారు టీడీపీలో లేరు, ఉండరు అన్న మాట!! కాకపోతే పాత సీసాలో కొత్త సారా అనే కామెంట్లు కొసమెరుపు!!

Read more RELATED
Recommended to you

Latest news