ఐపీఎల్ 2023: కష్టకాలంలో అర్ధసెంచరీతో మెరిసిన ఆయుష్ బధోని !

-

ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై మరియు లక్నో లు తలపడుతున్నాయి, ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో కు సరైన ఆరంభం లభించకపోగా వరుసగా వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. రాహుల్ లేకపోవడంతో మనన్ వోహ్రా కు జట్టులో చోటు దక్కింది, అదే విధంగా వరుసగా ఫెయిల్ అవుతున్న హోదా స్థానంలో కరణ్ శర్మ ను తీసుకున్నారు. అయితే వీరిద్దరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇక మేయర్స్ సైతం స్పిన్ కు బలి అయ్యాడు. ఆ విధంగా పవర్ ప్లే లో కేవలం 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కృనాల్ పాండ్య సైతం స్పిన్ వలలో చిక్కుకున్నాడు.

అలా కష్టాల్లో ఉన్న లక్నో ను యంగ్ ప్లేయర్ ఆయుష్ బధోని మరియు నికోలస్ పూరం లు ఒక చక్కని భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఆరవ వికెట్ కు 59 పరుగులను జోడించి కాస్త లక్నో ను సురక్షితమైన స్థానానికి చేర్చారు. ఈ దశలో ఆయుష్ బధోని 33 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. వర్షం రావడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ఆగింది

Read more RELATED
Recommended to you

Latest news