రావు రమేష్ డైలాగు ఫాలో అవుతున్న బాబు… తప్పదు మరి!

-

కొత్త బంగారు లోకం సినిమాలో కాలేజ్ స్టూడెంట్స్ కి వయసుల వారీగా ఆలోచనా విధానంలో, పరిస్థితుల ప్రభావం వల్ల అభిరుచుకు, అవసరాలు ఎలా మారిపోతాయో తనదైన శైలిలో చెబుతాడు లెక్చరర్ పాత్రలో ఉన్న రావూ రమేష్! అన్నీ చెప్పాక 30 దాటాక అంతా కాంప్రమైజ్.. కాంప్రమైజ్.. అయిపోతుంది లైఫ్ అని! ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఈ డైలాగ్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతుందని అంటున్నారు విశ్లేషకులు!

అవును… ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి అంతా కాంప్రమైజ్.. కాంప్రమైజ్..! అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప శత్రువులు మిత్రులూ లేరీ పరిస్థితుల్లో! విలువలు గిలువలు జాన్ తా నై.. ఓన్లీ దోస్తానా హై! బాబుకు అర్జెంటుగా ఒక మిత్రుడు కావాలి. అది శాస్వతంగానా టెంపరరీగానా అన్నది అప్పటి బాబు పరిస్థితిపై బేస్ అయ్యి ఉంటుంది! ఇంతకు మించి కండిషన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు!

అవును… బాబుకు ఇప్పుడు వీలైతే బీజేపీ కాదంటే కాంగ్రెస్… ఎవరొక స్నేహితుడు కావలెను! ఎవరైనా పర్లేదు! గతంలో చేసిన చారిత్రక తప్పిదం (బీజేపీతో జతకట్టడం) మళ్లీ చేయడానికి బాబు రెడీ! ఎవరికి వ్యతిరేకంగా పార్టీ పుట్టిందో (కాంగ్రెస్) వారితో దోస్తీ కట్టడానికైనా రెడీ! దత్తపుత్రుడు ఎలాగూ ఎన్నికల సమయంలో వచ్చేస్తాడు! సో… కాంప్రమైజ్.. కాంప్రమైజ్!! బండి నడవాలి కదా! ప్రస్తుతం బాబు బండి నడవాలంటే హెచ్చులకు పోకూడదు.. కోరుకున్నది దొరకనప్పుడు దొరికనదానితో తృప్తి పడటమే… కాంప్రమైజ్ కాంప్రమైజ్!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news