క్రైస్తవ్యం – హిందుత్వం… మధ్యలో బాబు భవితవ్యం!

-

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మతమార్పిడులు ఎక్కువయ్యాయని చెప్పుకొస్తున్నారు చంద్రబాబు. తాను హిందువుని అని.. తాను వెంకటేశ్వర స్వామి భక్తుడికి అని అడిగినవారికి అడగనివారికీ కూడా చెబుతున్నారు. అంతవరకూ పర్లేదు హిందువుల ఓట్ల కోసం పాట్లు అనుకుంటే… ఏకంగా మతవిద్వేషాల్ని రెచ్చగొట్టే స్థాయిలో దిగజారిపోతున్నారు! ఇది బాబు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయబోతుందని అంటున్నారు విశ్లేషకులు!

ఇంతాకాలం చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారంటే అందుకు కేవలం ఒక కులమో ఒక మతమో మాత్రమే కారణం అని అనుకుంటున్నారా? అది బీజేపీకి చెల్లితే చెల్లుండొచ్చు! బాబు పూర్తిగా ఆ విషయాలపై ఆధారపడే రాజకీయాలు చేసుకుంటూపోతే కష్టం అనేది టీడీపీ కార్యకర్తల ఆవేదన కూడా!! ఆ సంగతులు అలా ఉంటే… ఒకసారి గతంలోకి వెళ్తే… చంద్రబాబుకు హిందుత్వంపైనా.. హిందూ దేవాలయాలపైనా ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్ధం అయిపోతుంది!

అవును… జగన్ సీఎం అయ్యక జరుగుతున్నట్లు చెబుతున్న మ‌త‌మార్పిడుల సంగ‌తేమో గానీ, మ‌త‌విద్వేషాల్ని ర‌గిల్చించ‌డానికి చంద్ర‌బాబు ప‌డుతున్న కుట్ర‌ల‌ను జ‌నం మాత్రం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. పుష్క‌ర స్నానాల్లో చంద్ర‌బాబు ప్ర‌చారపిచ్చికి 29 మంది చ‌నిపోయిన నాటి దుర్ఘ‌ట‌నను జ‌నం మ‌రిచిపోలేదన్న విషయం బాబు మరిచిపోకూడదు కదా! అదేవిధంగా త‌న పాల‌న‌లో రకరకాల కారణాలతో అనేక దేవాల‌యాల‌ను ప‌డ‌గొట్టి పునర్ణిర్మించని సంగతి ఏపీలోని హిందువు మరిచిపోగలరా?

అవన్నీ ఏపీలోని హిందువులు మరిచిపోయారన్నట్లుగా భావిస్తోన్న చంద్రబాబు… ఇప్పుడు హిందూ మ‌తం గురించి ధ‌ర్మోప‌న్యాసాలు చెబితే జనం నమ్ముతారా? జనం గతాన్ని ఎప్పుడూ మరిచిపోరు కదా! ఎందుకంటే… చంద్రబాబుకి ఉందని వైకాపా నేతలు చెబుతున్న అల్జీమర్ వ్యాది ప్రజలకు లేదు కదా!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news