చంద్రబాబు ఈ పని చేయకపోతే టీడీపీ మునిగినట్టే…?

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎంతవరకు బలోపేతమవుతుంది ఏంటన్నది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మాత్రం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేక పోతుంది అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ను బలోపేతం చేసే విషయంలో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విషయంలో అసలు ఎవరు ముందుకు వస్తున్నారు అనేది అర్ధం కావడం లేదు. చాలా మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో పనిచేయడానికి ఆసక్తికరంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు వాళ్ళను ముందుకు రానీయడం లేదు. ఇక పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కూడా తమకు అనుకూలంగా ఉండే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో తప్పులు చేస్తున్న సరే సోషల్ మీడియాలో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించే విషయంలో ఇప్పుడు ఆసక్తి చూపించకపోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్ పరిణామాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు అనే భావన కూడా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొంత మందిని సోషల్ మీడియా విషయంలో నియమించాల్సిన అవసరం ఉందని అనవసరంగా పార్టీ కోసం పని చేయకుండా సోషల్ మీడియాలో విభేదాలు సృష్టించే వారిని పక్కన పెట్టకపోతే పార్టీ సంస్థాగతంగా నష్టపోతుందని అని అంటున్నారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...