బాబు కొత్త డ్రామా… స్వాగతిస్తూనే వ్యతిరేకిస్తున్నారు!

రెండు కళ్ల సిద్ధంతం, రెండు నాలుకల ధోరణి అంటూ సమైక్యాంధ్ర ఉద్యమంలో తన మార్కు రాజకీయాన్ని చూపించి, తెలంగాణలో పార్టీ మనుగడను ప్రశ్నార్ధకం చేసుకున్న చంద్రబాబు… రాజధాని విషయంలో మరో కొత్త డ్రామాకు తెరలేపారు. వివాదాలు సృష్టించడం, తదనుగుణంగా రాజకీయ లబ్ధిపొందడాన్నే తన సక్సెస్ సీక్రెట్ గా మలుచుకుంటున్న చంద్రబాబు… తాజాగా కర్నూలు తమ్ముళ్లకు స్క్రిప్ట్ ఇచ్చారు!

అమరావతి తన కల, అమరావతి తమ్ముళ్ల కల, ప్రపంచస్థాయిలో అమరావతి అని ఇంతకాలం రకరకాలా మాటలు చెప్పిన చంద్రబాబు… అదికాస్తా బౌన్స్ బ్యాక్ అయ్యి, నేడు అమరావతి రైతులు ఇబ్బందిపడటానికి తనదే నేరం అనేమాటలు వింటున్న దశలో మరో రాజకీయానికి తెరలేపారు. ఇంతకాలం రైతుల పేరు చెప్పి రాజకీయ క్రీడలు ఆడిన చంద్రబాబు… ఇప్పుడు కర్నూలులో రాజధాని కావాలంటూ తమ్ముళ్లతో చెప్పిస్తున్నారు!

అవును… మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా టీడీపీ ఆఫీసు వద్ద టీడీపీ నాయకుల ఆందోళన మొదలెట్టారు. అనంతరం కాసేపటికి… కర్నూలులో హైకోర్టును స్వాగతిస్తున్నామన్నారు! ఇక్కడే బాబు రెండుకళ్ల సిద్ధాంతం బయటపడిందని అంటున్నారు విశ్లేషకులు. ఒకపక్క మూడురాజధానుల బిల్లును వ్యతిరేకించడం ఏమిటి… ఆ మూడు రాజధానుల్లో ఒకటైన కర్నూలులో హైకోర్టును స్వాగతించడం ఏమిటి?

మూడురాజధానుల బిల్లును వ్య్యతిరేకిస్తే.. వ్యతిరేకిస్తున్నామనే స్టాండ్ మీదే నిలబడాలి… అలా కాకుండా కర్నూలుకు ఒక రాజధాని వస్తున్నందుకు హ్యాపీ ఫీలవ్వాలి. అలా కాకుండా… మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ, వాటిలో కర్నూలును స్వాగతిస్తున్నారు కర్నూలు తమ్ముళ్లు! ఇదే క్రమంలో… కర్నూలుకు కేవలం హైకోర్టు వస్తే వరిగేదేమీ లేదని, పరిపాలనా రాజధానిగా కర్నూలును చేయాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు! బాబు రాజకీయం ఇలానే ఉంటుందనేది వినిపిస్తోన్న కామెంట్!!