పోలవరం ప్రాజెక్టు దుస్థితికి ప్రస్తుత సీఎం చంద్రబాబే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 2018లోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి ఆయన విస్మరించారని విమర్శించారుు. జగన్ హయాంలో పోలవరం పనులు శరవేగంగా జరిగాయి. పోలవరానికి ఆయన ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. మా పాలనలో ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి తప్పులు జరుగలేదు. జగన్ పై బురద చల్లాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు.
పోలవరంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అబద్ధమని చెప్పారు. 2019లో పూర్తి చేస్తామని గతంలో చెప్పారని.. తాము 2022లో పూర్తి చేయాలనే టార్గెట్ తో పనిచేశామన్నారు. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా సమయం పడుతుందని చెప్పామన్నారు. చంద్రబాబు తప్పిదం వల్లే.. పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో పడిందని ఆరోపించారు. ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని.. తాము వేసిన ఓట్లు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు.