పెన్షన్ల అంశంపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

-

పెన్షన్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పెన్షన్ దారులందరికీ ఇళ్ల వద్దే నగదు ఇవ్వాలి.. పెన్షన్ పంపిణీలో రెండు విధానాలు సరికావని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి కుట్రలకు, నాటకాలకు తెర దించాలని కోరారు. లబ్దిదారులందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని తెలిపారు. సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని ప్రస్తావించారు. ఆ బాధ్యతను సీఎం జగన్ సక్రమంగా నిర్వహించకుండా.. దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వార్ధ ప్రయోజనాల కోసం ఎప్పుడూ లేని విధంగా, ఎన్నికల ముందు పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారని లేఖలో మండిపడ్డారు. గతేడాది 2022 ఏప్రిల్ 1వ తేదీకి ముందే పింఛన్ల నిధులు బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి 1వ తేదీన పంపిణీ చేశారన్నారు. ఈ ఏడాది కూడా ముందే బ్యాంకుల నుండి విత్ డ్రా చేసి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఎదురయ్యేది కాదని ప్రస్తావించారు. మార్చి 16 నుండి మార్చి 30 మధ్య 15 రోజుల్లోనే సొంత కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు విడుదల చేశారు.. పింఛన్ దారులకు ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్లు కూడా సొంత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానా ఖాళీ చేశారని పేర్కొన్నారు. నిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీ జాప్యం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news