జగన్ ఆరా తీస్తున్నారా…?

తిరుపతి ఉప ఎన్నికలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే కొంతమంది నేతలు ముఖ్యమంత్రి జగన్ మాట వినడం లేదు అనే అభిప్రాయం ఉంది. రాజకీయంగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు వైసిపి వాళ్ళు ఉన్నా… అయినా సరే కొన్ని కొన్ని అంశాల్లో వైసీపీ నేతలు సమర్థవంతంగా వెళ్ళలేకపోవడంతో కొన్ని సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పెరుగుతున్నాయి.

ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల విషయంలో జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొంతమంది ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పని చేయడం లేదు అనే ఆరోపణల నేపథ్యంలో వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని జగన్ తెప్పించుకున్నారని సమాచారం. ఇతర జిల్లాల నుంచి కూడా కొంత మంది ఎమ్మెల్యేలు అక్కడ పని చేస్తున్నారు.

సరిహద్దు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది నేతలు అక్కడకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా ఫలితాలు మాత్రం ఎప్పుడూ అనుకున్న విధంగా కనబడటంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తలకు ధైర్యం చెప్పే నాయకులు లేరు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వంటి వారు చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన వస్తుంది. వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి ఆశించిన స్థాయిలో స్పందన కనబడటం లేదు. కాబట్టి ఇప్పుడు జగన్ తిరుపతిలో ఎంతవరకు వైసీపీ నేతల పనిచేస్తున్నారని దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.