మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేసిన సీఎం జగన్‌

మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేశారు సీఎం జగన్‌. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. ఏలూరు జిల్లా దెందలూరు లో కార్యక్రమాన్ని ప్రారంభిచారు సీఎం జగన్. ఈ సందర్భంగా దెందులూరు సభలో సీఎం జగన్ మాట్లాడారు.

78,94,169 మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేకూరుతుందని వైఎస్ఆర్ ఆసరా ప్రారంభించామని చెప్పారు. 45నెలల కాలంలో మహిళ సాధికారత విషయంలో తీసుకు వచ్చిన మార్పు ఎంత గొప్పగా వుందో దెందులూరు సభ చూస్తే అర్ధం అవుతుందని వివరించారు. 10 రోజుల పాటు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆసరా సొమ్ము అందించే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పొదుపు సంఘాలకు అండగా ఉంటూ వచ్చామ న్నారు సీఎం జగన్‌.