రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన వ్యక్తి మృతి చెందాడు.ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా జగన్నాథపురంకు చెందిన గురుమూర్తి మృతి చెందారు. ఇంకా తెలియని 140 మంది తెలుగువాళ్ల ఆచూకీ లభించలేదు.
ఇవాళ ఒడిశా మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు అయ్యాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం…ఒడిశా రైలు ప్రమాదంలో 290కి చేరింది మృతుల సంఖ్య. ఐతే తాజాగా గురుమూర్తి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన శ్రీకాకుళం జిల్లా వాసి.. సంతబొమ్మాళి మండలం జగన్నాథపురంకు చెందిన గురుమూర్తిగా గుర్తించారు.