భర్తపై సంచలన ఆరోపణలు చేస్తున్న ప్రముఖ బుల్లితెర నటి..!

-

ప్రముఖ బుల్లితెర జంట ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిగా మారింది. ఎందుకంటే అలా పెళ్లి చేసుకున్నారో లేదో ఇలా రెండు నెలలకే విడాకులు తీసుకొని సంచలనం సృష్టించారు. ఇన్నాళ్లు ప్రేమలో ఉండి కూడా తెలుసుకోలేని ఎన్నో నిజాలు పెళ్లి తర్వాత తన భర్తలో చూశాను అంటూ చెప్పుకొస్తోంది. ఇకపోతే ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం.. కామన్ కానీ ఆ తర్వాత అది ప్రేమ కాదు ఆకర్షణ అని తెలిసి విడిపోయే వారే ఇప్పుడు చాలామంది ఉన్నారు. కానీ తమ బంధాన్ని బలంగా మార్చుకుంటూ సాగిపోయేవారు కూడా ఉన్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరినొకరు నచ్చక వెంటనే విడాకులకు వెళ్లేవారు మాత్రం చాలా తక్కువగానే ఉంటారు. అది కూడా కేవలం రెండు నెలలకే.. ప్రస్తుతం ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తోంది. కోలీవుడ్లో సంయుక్త , విష్ణుకాంత్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రేమించుకున్నంత వరకు కూడా వీరిద్దరు బ్యూటిఫుల్ కపుల్ గానే ఉన్నారు. కానీ పెళ్లి తర్వాతే అసలు కథ మొదలయ్యింది.. తమిళంలో సిప్పినీల్ ముత్తు అనే సీరియల్ లో కలిసి నటించిన వీరిద్దరి మధ్య స్నేహం మొదలై ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇక మార్చి మూడవ తేదీన తమ ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే పెళ్లయిన రెండు నెలలకి తాము విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు.

సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు విసురుతూ విడాకులు తీసుకోబోతున్నారు. పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఈ విషయంపై సందర్భంగా విష్ణుకాంత్ పోస్ట్ పెడుతూ .. మౌనంగా ఉంటే ఎఫైర్స్ నిజమైన ప్రేమను కూడా ఫేక్ ప్రేమగా మార్చేస్తాయి.. అనగా దీనికి బదులుగా సంయుక్త స్పందిస్తూ కొత్త జీవితానికి ప్రారంభం.. ఇకపై మరింత బలంగా ముందుకు వెళ్తామంటూ సంయుక్త చెప్పుకొచ్చింది.. ఏది ఏమైనా ఈ జంట ఎంతో అందంగా ఉండి ఇలా ఒక్కసారిగా విడిపోవడం అభిమానులను కలవరపెడుతోందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news