విజయవాడలో సీజేఐ చంద్రచూడ్ తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ

-

విజయవాడలో సీజేఐ చంద్రచూడ్ తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ అయ్యారు. అనంతరం కోర్టులలో పెండింగ్‌ కేసులపై సుప్రీంకోర్టు సీజే డీవై చండ్రచూడ్ కామెంట్స్ చేశారు. పెండింగ్‌ కేసులపై న్యాయమూర్తులు ప్రత్యేక శ్రద్ద పెట్టడం, కొన్ని మెళకువలు పాటించడం ద్వారా వాటి సంఖ్యను తగ్గించవచ్చు…గుంటూరు జిల్లాలో 1980మార్చి 22న నమోదైన సివిల్ కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని వెల్లడించారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కోర్టులో 1988 సెప్టెంబర్ 19న దాఖలైన క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉందని.. 1980-90ల మధ్య గుంటూరు జిల్లాలో నాలుగు సివిల్ కేసులు, ఒక క్రిమినల్ కేసు పరిష్కరిస్తే పదేళ్లు ముందుకెళ్లొచ్చని వెల్లడించారు. అనంతపురం జిల్లాలో1978-88ల మధ్య 9క్రిమినల్ కేసులు, ఒక‌ సివిల్ కేసు పరిష్కరిస్తే పదేళ్లు ముందుకు వచ్చేస్తారని… హైకోర్టులో 1976 నుంచి పెండింగ్ లో ఉన్న 138కేసులు పరిష్కరిస్తే పదేళ్లు ముందుకొస్తారని చెప్పారు. ఇది ఏపీలోనే కాదు దేశంమొత్తం ఇలాగే ఉందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news