తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్. అయితే… కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ కు సీరియస్ గా ఉందని తోటి నటుడు ఇమాన్యుయల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వీలైనంత త్వరగా అతనికి ఆపరేషన్ చేయాలని… ఆపరేషన్ కు చాలా ఖర్చు అవుతుందని… దాతలు హెల్ప్ చేయాలని కోరుతూ పోస్ట్ పెట్టారు.
ఈ క్రమంలో జబర్దస్త్ పంచ్ ప్రసాద్ వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పంచ్ ప్రసాద్ ఆరోగ్య సమస్య ను సీఎం దృష్టికి తీసుకు వచ్చారు మంత్రి ఆర్కే రోజా. కిడ్నీ సమస్య తో తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతున్న పంచ్ ప్రసాద్ కు యశోద ఆస్పత్రి లో వైద్యం అందుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం చేయిస్తోంది ఏపీ ప్రభుత్వం.