ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే ఉద్యోగుల హెచ్ఆర్ఏను 12 శాతం నుంచి 16% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల కేంద్రాలలో పని చేసే ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.

పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుంది. ఈ నిర్ణయం పై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news