నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యో గులకు శుభవార్త చెప్పింది వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్. గ్రూప్స్ పోస్టుల భర్తీకి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ పోస్టుల కంటే అధికంగా భర్తీకి అనుమతి ఇచ్చింది వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్. అదనంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి కూడా అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

110 గ్రూప్ 1 పోస్టులు, 182 గ్రూప్ 2 పోస్టుల భర్తీ చేయడమే కాకుండా… త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది ఏపీపీఎస్సీ. అలాగే.. గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డీఎస్పీ, డీఎఫ్ఓ,మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవో పోస్టులు భర్తీకి అనుమతి ఇచ్చింది వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్. గ్రూప్ 2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టుల భర్తీ చేయాలని ఫైనల్‌ నిర్ణయాన్ని వచ్చింది వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్. ఈ పోస్టుల భర్తీ లో ఎలాంటి అవినీతికి తావు ఉండబోదని తేల్చి చెప్పింది సర్కార్‌.