ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘సురక్ష చక్ర’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఈనెల 15 నుంచి అమలు చేయనుంది.
వాలంటీర్లు, గృహసారథులు నెలరోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలన చేయనున్నారు. పథకాలకు అర్హత ఉన్న వారిని గుర్తించి వారే దరఖాస్తులు చేసి, లబ్ధి చేకూరుస్తారు. తమకు అన్ని అందుతున్నాయని చెప్పిన వారిని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతారు.
కాగా,అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని… ఈనెల 28వ తేదీన అమ్మఒడి పథకం డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. జూన్ 12న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేస్తానన్న మంత్రి… జూన్ 16న జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 3 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.