‘గడప గడపకు మన ప్రభుత్వం’పై క్యాంప్ కార్యాలయంలో వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, ముఖ్య నేతలతో పాటు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. ఇక ఈ వర్క్‌షాప్‌లో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. మొదటిసారి వర్క్‌షాపుతో పోలిస్తే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పురోగతి బాగుంది. కాని అందరూ అందరికీ ఒక విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను.
పరీక్ష రాసేటప్పుడు షార్ట్‌కట్స్ ఉండవు. షాట్‌కర్ట్స్‌కు మనం తావిస్తే ఆపరీక్షల్లో ఫెయిల్ అవుతాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ఎందుకంటే, రేపు మనల్ని మనం గెలవడం కోసం.. మనకు మనంగా చేస్తున్న కార్యక్రమం ఇది. దీంట్లో ఎక్కడైనా షార్ట్‌కట్స్ ఉపయోగిస్తే నష్టపోయేది మనమే. ఇవాళ్టి నుంచి చూస్తే ఎన్నికలకు బహుశా 19 నెలలు ఉందని..అన్ని ఇళ్లు తిరగాలని కోరారు. ప్రతిరోజూ కూడా పరీక్షలకు సిద్ధం అవుతున్నామని భావించి అంతా అడుగులు వేయాలి. అలా చేయకపోతే పని చేయకపోతే నష్టపోయేది మనమేనని వెల్లడించారు సీఎం జగన్.