సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పర్యటనలో బందరు పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి బందరు మండలం తపసిపూడి గ్రామానికి చేరుకుంటారు సీఎం జగన్.
అక్కడ పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ చేసి, పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. అనంతరం మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి చేరుకొని.. అక్కడినుండి జిల్లా పరిషత్ సెంటర్ లోని భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ గ్రౌండ్ కి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభానంతరం మచిలీపట్నం నుండి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సిఎంఓ వెల్లడించింది.