మాటలు చెప్పే వారికి.. పనులు చేసే వారికి తేడా ఇదే – పేర్ని నాని

-

బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని. ఆదివారం ఆయన బందరులో మీడియాతో మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ మరణంతో బందరు పోర్టు నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఈ భూమి మీద ఉన్నంతవరకు బందరు పోర్టు ప్రజల ఆస్తి అన్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేయలేదని స్పష్టం చేశారు. వందకు వందశాతం 1700 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు.

ఈ పోర్టు నిర్మాణంతో జిల్లా ముఖచిత్రమే మారబోతుందన్నారు పేర్ని నాని. ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళితే పోర్టు నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని సీఎం జగన్ భావించారని, అందుకే బందరు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తుందని చెప్పారు. మే 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బందరులో పర్యటించి ఈ పోర్టు నిర్మాణ పనులను లంచనంగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే టిడిపి నేతలపై సెటైర్లు వేశారు పేర్ని నాని. మాటలు చెప్పే వారికి.. పనులు చేసే వారికి ఇదే తేడా అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news