బ్రేకింగ్: 18 ఏళ్ళు పైబడిన వాళ్లకు వాక్సిన్ లేదు, జగన్ కీలక వ్యాఖ్యలు

దేశంలో వాక్సిన్ కొరత ఉత్పత్తి సామర్ధ్యంపై సిఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా వాక్సిన్ కి సంబంధించి నేడు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జగన్ వాక్సిన్ పై తన అభిప్రాయం చెప్పారు. కరోనాకు వాక్సిన్ అనేది ఇప్పుడు పరిష్కారంగా ఉందని జగన్ వివరించారు. వాక్సినేషన్ సమస్య ఎప్పుడు తీరుతుందో చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

వచ్చే ఏడాది జనవరి నాటికి అందరికి వాక్సిన్ అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 18 ఏళ్ళు పైబడిన వారికి సెప్టెంబర్ నుంచి వాక్సిన్ అందిస్తామని అన్నారు. కరోనా విషయంలో సానిటేషన్ అనేది చాలా కీలకం అని అందరూ చాలా శుభ్రంగా ఉండాలని జగన్ హెచ్చరించారు. 18 ఏళ్ళు పైబడిన వారు అందరికి వాక్సిన్ ఉచితంగా ఇస్తామని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.