ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని NHRC కి కూటమి నేతలు ఫిర్యాదు

-

పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎస్ తీసుకున్న నిర్ణయం కారణంగా.. రాష్ట్రంలో 33 మంది వృద్ధులు మరణించారని ఎన్ హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు.


కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అధికార వైసీపీ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎస్పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. పింఛన్ల పంపిణీకి అవసరమైన నిధులు సకాలంలో సమకూర్చడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి వద్దే పింఛన్లు అందించేలా సీఎస్ ను ఆదేశించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేసేలా చూడాలని ఎన్ హెచ్ ఆర్సీకి విన్నవించారు.

Read more RELATED
Recommended to you

Latest news