‘త్వరలో బీజేపీలోకి హరీష్ రావు’ వెళతాడంటూ కాంగ్రెస్ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ..పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. బీఆర్ఎస్ పార్టీలో కాస్త అసంతృప్తి నెలకొంది. ఈ తరుణంలోనే కాంగ్రెస్ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ అల్లుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీలోకి ఆయన్ను పంపి పార్టీని కాపాడుకునే కొత్త కుట్రలకు కేసీఆర్ తెర లేపుతున్నారని ఆయన అంటున్నారు. బిడ్డ కోసం, పార్టీ కోసం, ఆస్తుల కోసం అల్లుడు హరీష్ భుజంపై తుపాకీ పెట్టి కాల్చే కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తోందని ఆయన అన్నారు. అయితే.. కాంగ్రెస్ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన తరుణంలో.. బీఆర్ఎస్ పార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇస్తున్నారు.