ఎన్నికల వేళ మంత్రి రోజాపై అవినీతి ఆరోపణలు.. వైసీపీ కౌన్సిలర్ సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తూ.. ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి రోజా ఊహించని పరిణామం ఎదురైంది. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి.. మంత్రి రోజా,  సోదరుడిపై సంచలన ఆరోపణలు చేశారు.

తనకు రిజర్వేషన్ కలిసి రావడంతో పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవీ ఇప్పిస్తామని చెప్పి తమను పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు. వారు రూ.70లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. తాము రూ.40లక్షలు అప్పగించినట్టు వెల్లడించారు భువనేశ్వరి. మంత్రి సోదరుడు కుమారస్వామి రెడ్డి పంపించిన వ్యక్తికి మూడు దఫాలుగా రూ.40 లక్షలు ఇచ్చామని స్పష్టం చేశారు. అయినప్పటికీ చైర్మన్ పదవీ ఇవ్వకపోగా.. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినా ఇవ్వడం లేదని ఇవాళ భువనేశ్వరి ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఈ క్రమంలో సీఎం జగన్ మంత్రి రోజాకి టికెట్ ఇస్తారా..? లేక మరొకరికీ కట్టబెడతారా.. అనే విషయం నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news